🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో ‘యంగ్ ఇండియా పోలీస్ స్కూల్’ విద్యార్థుల ప్రతిభ

SURAMONI BALAIAH
SURAMONI BALAIAH 📍 తాజా వార్త | 🗓 11 Oct 2026 | ⏰ 09:19 PM

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో నగరానికి చెందిన యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సత్తా చాటారు. తమ పట్టుదల, క్రీడాస్ఫూర్తితో ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ ఈవెంట్లలో రాణించి ఏకంగా 9 పతకాలు (3 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు) సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు.

బాలికల అండర్‌-10 విభాగంలో సిహెచ్‌. లాస్య శ్రీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. 60 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందెంలో రెండు స్వర్ణ పతకాలను కైవసం చేసుకుని స్టార్‌ పెర్ఫార్మర్‌గా నిలిచింది. ఇదే విభాగంలో లంక పార్వతి నిలకడైన ప్రతిభ కనబరిచి రెండు విభాగాల్లోనూ రజత పతకాలను సొంతం చేసుకుంది.

జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో ‘యంగ్ ఇండియా పోలీస్ స్కూల్’ విద్యార్థుల ప్రతిభ

ఫీల్డ్‌ ఈవెంట్లలో అండర్‌-10 బాలికల లాంగ్‌జంప్‌లో సాన్విక గౌడ్‌ కాంస్యం సాధించగా, అండర్‌-12 లాంగ్‌జంప్‌లో ఎం. అశ్విని రజత పతకం కైవసం చేసుకుంది.అండర్‌-14 బాలికల 60 మీటర్ల పరుగు పందెంలో సింధం వజ్ర వరుణవి కాంస్య పతకం గెలుచుకుంది.

బాలుర విభాగంలోనూ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ క్రీడాకారులు మెరిశారు.అండర్‌-12 బాలుర 300 మీటర్ల పరుగులో సిహెచ్‌.రితేష్‌ రజతం సాధించగా, సిహెచ్‌. జీవన్‌ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు.విద్యార్థుల కఠోర సాధన, క్రమశిక్షణతో పాటు వారి తల్లిదండ్రులు, కోచ్‌లు, పాఠశాల యాజమాన్యం ప్రోత్సాహమే ఈ ఘనతకు కారణమని పాఠశాల వర్గాలు తెలిపాయి.

ప్రతిభ చాటి పతకాలు సాధించిన విద్యార్థులను, పోటీల్లో పాల్గొన్న వారిని యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. విద్యార్థుల్లో శారీరక దృఢత్వం, క్రీడాస్ఫూర్తి, ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ క్రీడల్లో వారిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు పాఠశాల నిరంతరం కృషి చేస్తుందని పేర్కొంది. ఈ విజయం ‘యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ టీం’కు గర్వకారణమని హర్షం వ్యక్తం చేసింది.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
SURAMONI BALAIAH
రచయిత గురించి (Author Bio)

SURAMONI BALAIAH

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్