🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

వేల్పుగొండ వినాయక మండపం వద్ద భక్తులకు అన్నదానం

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 21 Sep 2026 | ⏰ 07:13 PM

టేక్మాల్ సెప్టెంబర్ 21: టేక్మాల్ మండల పరిధిలోని వేల్పుగొండ గ్రామంలో ముదిరాజ్ సంఘం వద్ద వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ శ్రీ ఆత్మనంద ఆశ్రమ పీఠాధిపతులు పూ”పా”వెంకటస్వామి దివ్య ఆశీస్సులతో సోమవారం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్న ప్రసాద వితరణ దాత గ్రామనికి చెందిన దాసరి లింగమయ్య కుటుంబ సభ్యులతో కలిసి గత మూడు సంవత్సరాల నుండి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. అనంతరం గణనాథుడికి ప్రతెక్య పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకొన్ని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని పాడి పశువు, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఆ విగ్నేశ్వరుని యొక్క దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకొని,అన్నదాన వికరణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలు నిర్వహించారు. అనంతరం అన్న ప్రసాద దాతను గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సన్మానించారు. రాత్రి భజన సంకీర్తన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలు, మహిళలు, యువతి యువకులు, చిన్నారులు, అధిక సంఖ్యలో పాల్గొని గణనాథున్ని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్