🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిలిపివేయాలి: నారాయణఖేడ్‌లో సీఐటీయూ నిరసన

చీటీ సాయితేజ
చీటీ సాయితేజ 📍 నారాయణఖేడ్ | 🗓 12 Oct 2026 | ⏰ 06:20 PM

నారాయణఖేడ్ ప్రతినిధి : ఎస్‌ఐఆర్‌ (ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ) ప్రక్రియను నిలిపివేయాలని, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నారాయణఖేడ్‌లోని మంగల్‌పేట్ బస్టాండ్ వద్ద సోమవారం నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా సీఐటీయూ డివిజన్ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో తొలగించినట్లు చెబుతున్న 13 కోట్ల 80 లక్షలకు పైగా ఓట్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఓటరు జాబితాలో పేరు కొనసాగించేందుకు 2002 నాటి ఓటరు వివరాలు, తల్లిదండ్రులు లేదా తాతముత్తాతలకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని కోరడం వల్ల నిరక్షరాస్యులు, పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

ప్రజల వద్ద ఉన్న ఆధార్ కార్డును ఓటరు గుర్తింపు కార్డుతో అనుసంధానం చేసే విధానాన్ని పరిశీలించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఓటు హక్కుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ కార్మికులు రాజు, బాలప్ప, ఏసు, సాయిలు, చంద్రకళ, సిద్ధమ్మ, మరియమ్మ, బేబీ, శకుంతల, సుశీల తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
చీటీ సాయితేజ
రచయిత గురించి (Author Bio)

చీటీ సాయితేజ

"గత కొన్నేళ్లుగా ప్రజానేస్తం తెలుగు డిజిటల్ న్యూస్ విభాగంలో సీనియర్ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. రాజకీయ, సామాజిక అంశాలపై ప్రామాణిక కథనాలు అందిస్తారు."

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్