🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

కరంజి వాసుల చిరకాల స్వప్నం సాకారం: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కృషితో రూ. 5.77 కోట్లతో సబ్‌స్టేషన్ మంజూరు

Abhinay
Abhinay 📍 కరంజి | 🗓 19 Oct 2026 | ⏰ 07:15 PM

భీంపూర్ మండలంలోని కరంజి (టి) గ్రామ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరింది. బోథ్ శాసనసభ్యులు అనిల్ జాదవ్ ప్రత్యేక చొరవతో గ్రామానికి రూ. 5 కోట్ల 77 లక్షల అంచనా వ్యయంతో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరైంది. దీంతో గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు లో-వోల్టేజ్ మరియు విద్యుత్ అంతరాయాల సమస్యల నుంచి శాశ్వత ఉపశమనం లభించనుంది.

గ్రామ ప్రజలకు, రైతులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సౌకర్యం కల్పించాలనే సంకల్పంతో ఎమ్మెల్యే చేసిన ప్రయత్నాలు ఫలించడంతో గ్రామస్తులు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని గుర్తుపెట్టుకుని, అధికారంలోకి వచ్చిన వెంటనే నిధులు మంజూరు చేయించడంపై గ్రామ పెద్దలు, రైతులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. “ప్రజలకు ఇచ్చిన మాటే నా బాట.. ఇచ్చిన హామీని నెరవేర్చడమే నా ప్రథమ కర్తవ్యం” అనే నిబద్ధతతో పనిచేస్తున్నామని తెలిపారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా బోథ్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తామని పునరుద్ఘాటించారు. కరంజి (టి) గ్రామానికి సబ్‌స్టేషన్ మంజూరు కావడం గ్రామ సర్వతోముఖాభివృద్ధిలో ఒక కీలక మైలురాయి అని పేర్కొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
Abhinay
రచయిత గురించి (Author Bio)

Abhinay

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్