🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

అద్దె భవనంలో ఎస్సీ బాలుర వసతి గృహం

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 30 Sep 2026 | ⏰ 04:18 PM

ఆందోల్ ప్రతినిధి సెప్టెంబర్ 30: ఆందోల్ నియోజకవర్గ పరిధిలోని చౌటకూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని అద్దె షట్టర్లలో కొనసాగిస్తుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్నేళ్లుగా పుల్కల్ మండలం ముదిమాణిక్యం గ్రామంలో కొనసాగిన ఈ వసతి గృహంలో మౌలిక వసతులు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, గ్రామస్తుల సహకారంతో విద్యార్థులు సర్దుకుపోయారు. అయితే, ఇటీవల ఈ వసతి గృహాన్ని చౌటకూర్ మండల కేంద్రానికి తరలించారు.

ప్రస్తుతం చౌటకూర్‌లోని ప్రధాన రహదారి పక్కన ఉన్న వాణిజ్య షట్టర్లలో ఈ హాస్టల్‌ను నిర్వహిస్తుండటంతో కనీస వసతులు కరవయ్యాయి. విద్యార్థులు ఉండటానికి తగినంత స్థలం లేకపోవడంతో పాటు ఆడుకోవడానికి క్రీడా మైదానం, ఇతర మౌలిక సదుపాయాలు ఏమాత్రం అనుకూలంగా లేవు. దీంతో తమ పిల్లలను ఈ వసతి గృహంలో చేర్పించేందుకు తల్లిదండ్రులు వెనుకంజ వేస్తున్నారు.

అద్దె భవనంలో ఎస్సీ బాలుర వసతి గృహం

ప్రధాన రహదారి పక్కనే ఇరుకైన షట్టర్లలో ఉండటం వల్ల విద్యార్థులు నిత్యం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ వెంటనే స్పందించి, చౌటకూర్‌లో ఎస్సీ బాలుర వసతి గృహానికి శాశ్వత నూతన భవనం మంజూరు చేసి త్వరితగతిన నిర్మించాలని ప్రజలు, విద్యార్థి సంఘాల నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్