టేక్మాల్ (ప్రజానేస్తం ప్రతినిధి): మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంచాయతీ రాజ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (PRTUTS) టేక్మాల్ మండల శాఖ సర్వసభ్య సమావేశం, 2026-2028 నూతన కార్యవర్గ ఎన్నికలు శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రక్రియకు పాపన్నపేట మండల శాఖ అధ్యక్షులు పంతులు రాజు, కౌడిపల్లి మండల ప్రధాన కార్యదర్శి బాలకిషన్ ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. మండలంలోని సుమారు 137 మంది ఉపాధ్యాయులు, ప్రాథమిక సభ్యులు భారీ సంఖ్యలో తరలివచ్చి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
మండల కార్యవర్గంలోని మొత్తం 12 పదవులకు 12 నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి పంతులు రాజు అధికారికంగా ప్రకటించారు. టేక్మాల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎండీ అమీరుద్దీన్ వరుసగా నాలుగోసారి మండల శాఖ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా సాలోజిపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ సహదేవ్ ఎన్నికయ్యారు.
అసోసియేట్ అధ్యక్షుడిగా ఎస్. శ్రీకాంత్ రెడ్డి, మహిళా అసోసియేట్ అధ్యక్షురాలిగా ఎస్. ప్రియాంక, ఉపాధ్యక్షులుగా నాయకం శ్రీకాంత్, బి. అశోక్, మహిళా ఉపాధ్యక్షులుగా బి. శ్వేత, ఎం. రవళి, కార్యదర్శులుగా టి. నరేష్, ఎస్. శివ, మహిళా కార్యదర్శులుగా ఎ. నాగరాణి, అర్షియా ఫాతిమా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నూతన కార్యవర్గానికి పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు తాళ్ల శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు సుంకరి కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి సామ్య, ఉపాధ్యాయులు బాల్య, వినోద్ కుమార్, ఆర్. రమేష్, కృష్ణ, ప్రశాంత్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. నాలుగోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన ఎండీ అమీరుద్దీన్ మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి కృషి చేస్తామని స్పష్టం చేశారు.







