మెదక్, అక్టోబర్ 2 . మెదక్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలుర జూనియర్, బాలికల సబ్‌జూనియర్ జట్లు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు శుక్రవారం మెదక్‌లోని గుల్షన్ క్లబ్ నుంచి బయలుదేరాయి. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త లింగమూర్తి సేటు క్రీడాకారులకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. పోటీల్లో ప్రతిభ కనబరిచి మెదక్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కోచ్‌లు, మేనేజర్లు, అసోసియేషన్ సభ్యులు రవి, రమేష్, రవికుమార్, శ్రీకాంత్ కుమార్. తదితరులు పాల్గొన్నారు.
క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేసిన లింగమూర్తి

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:






