🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

గ్రామాల్లోని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

SURAMONI BALAIAH
SURAMONI BALAIAH 📍 కేశంపేట | 🗓 11 Oct 2026 | ⏰ 09:13 PM

రంగారెడ్డి జిల్లా, అక్టోబర్ 11: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ కేశంపేట మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలతో ఎమ్మెల్యే శంకర్ నేరుగా మాట్లాడి గ్రామాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, స్థానికంగా నెలకొన్న ఇబ్బందులు,అభివృద్ధి పనుల పురోగతిపై నాయకులతో చర్చించారు.

ప్రజలకు సంబంధించిన సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చిన నాయకులకు స్పందించిన ఎమ్మెల్యే శంకర్ గ్రామాల్లోని సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి, అతి త్వరలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, గ్రామాల అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని నాయకులకు సూచించారు. ఈ ముఖాముఖి సమావేశం ద్వారా గ్రామస్థాయి సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లే అవకాశం లభించిందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కేశంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనుమగల్ల రమేష్, పీఏసీఎస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జగదీష్ అప్పా, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు గూడ విరేష్, మాజీ జెడ్పీటీసీ విశాల శ్రవణ్ రెడ్డి, సీఐటీయూ నాయకులు రఘు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్, పీఏసీఎస్ డైరెక్టర్లు రాజేందర్, మనోహర్, రావుల పెంటయ్య, లింగం, బోధనంపల్లి సర్పంచ్ నగేష్, పూటోనిగూడ సర్పంచ్ భాస్కర్, కొండారెడ్డిపల్లి సర్పంచ్ పల్లె ఆనంద్, ఆల్వాల్ సర్పంచ్ సురేష్ రెడ్డి,

వేములనర్వ సర్పంచ్ సువర్ణ నర్సింహా, దేవునిగుడి తండా సర్పంచ్ సుజాత హనుమంతు, వెంకమ్మగూడ సర్పంచ్ అశోక్, కొత్తూరు ఉమ్మడి మండలాల మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనాథ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రాణి, సీనియర్ నాయకులు తుమ్మల గోపాల్, ప్రకాష్, కోడూరు రాములు, ఎస్టీ సెల్ అధ్యక్షులు రూప్లా నాయక్, అంజయ్య, కుమార్, రాఘవేందర్, మల్లేష్, దర్శన్, యాదగిరి, కిషన్ తదితర గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
SURAMONI BALAIAH
రచయిత గురించి (Author Bio)

SURAMONI BALAIAH

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్