రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా షాద్ నగర్ పట్టణంలోని నెహ్రు కాలనీలో కాలానివాసులు ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ, పూజా మరియు బుగ్గారెడ్డి గార్డెన్ లో రెడ్డి సేవాసమితి, రెడ్డి మహిళా సేవా సమితి సంయుక్తంగా ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల కార్యక్రమాలలో ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ నవరాత్రి వంటి ఆధ్యాత్మిక ఉత్సవాలు సమాజంలో భక్తిభావాన్ని పెంపొందించడమే కాకుండా, మన సాంప్రదాయాలను భావితరాలకు అందిస్తాయన్నారు. అమ్మవారి కృపతో సమాజంలో ప్రతి ఒక్కరూ శాంతిసౌఖ్యాలతో వర్ధిల్లాలన్నారు. మండప నిర్వాహకులు ఇలాగే భక్తిభావంతో ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన ఆకాంక్షించారు. బతుకమ్మ సంబరాలు మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలని అన్నారు.

ఈ కార్యక్రమంలో విష్ణు వర్ధన్ రెడ్డి, షాద్ నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు బీరం గూడ జగన్ మోహన్, గ్రంధాలయ చైర్మన్ మదన్ మోహన్ రెడ్డి, మాజీ జడ్పి టిసి తాండ్ర విశాల రెడ్డి, పోమాల్ పల్లి సర్పంచ్ బుర్రి స్వప్న భూపాల్ రెడ్డి, మహాదేవ్ పూర్ సర్పంచ్ అనూష రవీందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ పాలమకుల చెన్నయ్య, మాజీ సర్పంచ్ నాగర్ కుంట ఉమా ప్రవీణ్ రెడ్డి, రవీందర్ రెడ్డి, నరసింహా రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి, ఇంద్రసేనా రెడ్డి, అరుంధతి రెడ్డి, మోహన్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, శ్రీపాల్ రెడ్డి, అజయ్ రెడ్డి, విజయ్ రెడ్డి, హరీశ్వర్ రెడ్డి, నవీన్ రెడ్డి, రెడ్డి సేవ సమితి సభ్యులు, యువ జన కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






