ఆందోల్ నియోజకవర్గం ప్రతినిధి సెప్టెంబర్ 21( ప్రజా నేస్తం ): అందోల్ డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల్లో వివిధ గ్రామాల్లో నివసిస్తున్న మన్నే కుల కుటుంబాలకు అవసరమైన వారికి మన్నే కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా మన్నే సంఘం ఆధ్వర్యంలో అందోల్ ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. అలాగే అందోల్ మండలంలోని మన్నే కుల కుటుంబ సభ్యులకు కుల ధ్రువీకరణ పత్రాలు అందించాలని కోరుతూ అందోల్ మండల తహసీల్దార్ (ఎంఆర్ఓ)కు కూడా వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మన్నే సంఘం జిల్లా అధ్యక్షులు మన్నే నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నే వెంకట్, రాష్ట్ర కార్యదర్శి మన్నే బుదయ్య, జిల్లా సలహాదారులు మల్లేశం, యాదగిరి, అమరేందర్, నాగరాజుతో పాటు పలువురు మన్నే సంఘం సభ్యులు పాల్గొన్నారు.
మన్నే కుల కుటుంబాలకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని వినతి

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:



