మెదక్ అక్టోబర్ 08 : మెదక్ మండలం పేరూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త సాయిలు అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్ రెడ్డి గురువారం పేరూరు గ్రామానికి చేరుకుని, సాయిలు పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం సాయిలు అంత్యక్రియల్లో స్వయంగా పాల్గొన్న ఆమె, మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. సాయిలు మృతి తీవ్ర బాధాకరమని పేర్కొంటూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తాము అన్ని వేళలా అండగా ఉంటామని మనోధైర్యం కల్పించడంతో పాటు బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో మెదక్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అంజాగౌడ్, మాజీ ఎంపీపీ కిష్టయ్య, మాజీ ఎంపీటీసీ యాదగిరి, నాయకులు రామచంద్రారెడ్డి, శ్రీధర్ రెడ్డి, షాకీర్, యాదగౌడ్, ఏగొండ తదితరులు పాల్గొన్నారు.








