🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

రెండో రోజు సంగారెడ్డిలో కొనసాగిన జగ్గారెడ్డి దంపతుల దీక్ష

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 సంగారెడ్డి | 🗓 08 Oct 2026 | ⏰ 09:11 PM

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి : కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, నిర్మల జగ్గారెడ్డి చేపట్టిన దీక్ష రెండో రోజూ కొనసాగింది. రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతుగా జగ్గారెడ్డి దంపతులు రాత్రింబవళ్లు దీక్షా వేదికపైనే నిరసన కొనసాగించారు. జగ్గారెడ్డి దంపతుల దీక్షకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో పాటు రైతులు, ప్రజా సంఘాల నాయకులు, సంగారెడ్డి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సంఘీభావం తెలిపారు.

రెండో రోజు సంగారెడ్డిలో కొనసాగిన జగ్గారెడ్డి దంపతుల దీక్ష

దీక్షా శిబిరాన్ని భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి సందర్శించి జగ్గారెడ్డి, నిర్మల జగ్గారెడ్డికి మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. దేశ ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీ పోరాటం కొనసాగినంతకాలం తమ నిరసన కార్యక్రమాలు కూడా కొనసాగుతాయని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలు రాహుల్ గాంధీకి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.

రెండో రోజు సంగారెడ్డిలో కొనసాగిన జగ్గారెడ్డి దంపతుల దీక్ష

సంగారెడ్డి నియోజకవర్గంలో రానున్న రోజుల్లోనూ సంఘీభావ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని జగ్గారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, జగ్గారెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్