🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

జగ్గారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 21 Sep 2026 | ⏰ 09:36 PM

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 21 ( ప్రజా నేస్తం) : నూతనంగా సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడిగా ఎన్నికైన చంద్రశేఖర్ రెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డితో కలిసి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని సంగారెడ్డి పట్టణంలోని రామ్‌నగర్ రామ్ మందిర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డిని జగ్గారెడ్డి ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. నిర్మలా జగ్గారెడ్డి డీసీసీ అధ్యక్షురాలిగా ఏడు సంవత్సరాలకు పైగా పనిచేశారని తెలిపారు. ఆమె హయాంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన పార్టీ కార్యక్రమాలకు మించి, చంద్రశేఖర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని చెప్పారు. చంద్రశేఖర్ రెడ్డికి తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలకు అనుగుణంగా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలతో సమన్వయంతో ముందుకు సాగాలని అన్నారు.

నూతన డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. తనను డీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేయడంలో సహకరించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నిర్మలా జగ్గారెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ, అందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు.

జగ్గారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి

నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ.. తన తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డిపై నమ్మకంతో డీసీసీ అధ్యక్షుడిగా నియమించిన ఏఐసీసీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. చంద్రశేఖర్ రెడ్డి ఎంపికకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర్ రాజనర్సింహ, జగ్గారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరి సహకారంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్