🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కార్యకర్తను పరామర్శించిన నీలం మధు: రూ.50వేలు తక్షణ ఆర్థిక సాయం అందజేత

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 సనత్ నగర్ | 🗓 06 Oct 2026 | ⏰ 10:45 PM

సంగారెడ్డి / హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లోని సనత్ నగర్ ఈఎస్ఐ (ESI) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ప్రముఖ నేత నీలం మధు ముదిరాజ్ మంగళవారం పరామర్శించారు.

బొల్లారం డివిజన్‌కు చెందిన పార్టీ కార్యకర్త ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చేరారన్న విషయం తెలుసుకున్న నీలం మధు నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. బాధితుడిని స్వయంగా కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన, అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని వైద్య బృందానికి విజ్ఞప్తి చేశారు.

అనంతరం బాధితుడి కుటుంబానికి భరోసా కల్పిస్తూ తక్షణ వైద్య ఖర్చుల నిమిత్తం తన వంతుగా రూ. 50,000 (యాభై వేల రూపాయల) ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఏ కష్టం వచ్చినా పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానని, ఎవరూ అధైర్యపడొద్దని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్