🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

కస్తూర్బా పాఠశాలలో ఎంపీ రఘునందన్‌రావు ఆకస్మిక తనిఖీ

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 27 Sep 2026 | ⏰ 06:22 PM

మెదక్, సెప్టెంబర్ 27: మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్‌రావు మెదక్ పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో నేరుగా మాట్లాడి పాఠశాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

పాఠశాలలో విద్యుత్ సమస్య కారణంగా బోర్ పనిచేయడం లేదని, ఆర్‌ఓ ప్లాంట్ పనిచేయడం లేదని, స్నానాలకు వేడినీటి సౌకర్యం లేదని విద్యార్థులు తెలిపారు. ఫ్యాన్లు పనిచేయక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. సుమారు 300 మంది విద్యార్థులకు కేవలం 12 బాత్రూమ్‌లు మాత్రమే ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దుస్తులు ఆరేసుకునేందుకు సరైన వసతి లేదని తెలిపారు. సమీపంలోని ఫంక్షన్‌ హాళ్ల నుంచి డ్రైనేజీ నీటిని పాఠశాల పక్కన వదలడంతో దుర్వాసనతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కాస్మోటిక్‌ చార్జీలు కూడా అందడం లేదని వివరించారు.

కస్తూర్బా పాఠశాలలో ఎంపీ రఘునందన్‌రావు ఆకస్మిక తనిఖీ

అనంతరం ఎంపీ పాఠశాలలో విద్యాబోధన, పరిసరాల పరిశుభ్రత, విద్యార్థుల వసతులను పరిశీలించారు. విద్యుత్ సమస్యను వెంటనే పరిష్కరించేందుకు ఎలక్ట్రిషియన్‌ను పిలిపించి సంబంధిత విద్యుత్ శాఖ ఏఈ, ఏడీలతో మాట్లాడారు. కొత్త ట్రాన్స్‌ఫార్మర్, మీటర్ ఏర్పాటుకు తన సొంత నిధులతో ఖర్చు చేస్తానని తెలిపారు. అలాగే బోర్ బండి తెప్పించి తన సొంత నిధులతో బోరు వేయించి, కొబ్బరికాయ కొట్టి బోరు పనులను ప్రారంభించారు.

అదనపు బాత్రూమ్‌లను ఎంపీ ల్యాడ్స్‌ నిధులతో నిర్మిస్తానని హామీ ఇచ్చారు. పాఠశాలలో స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ కార్యకర్తలను ఆదేశించారు. పాఠశాలలోని సమస్యలపై జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులకు ఎలాంటి ఆటంకం లేకుండా నాణ్యమైన విద్య, మంచినీరు, మరుగుదొడ్లు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని అధ్యాపకులకు ఎంపీ సూచించారు. విద్యార్థుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్