మెదక్ జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 21 ప్రజా నేస్తం : మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి నంబర్ వన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. నియోజకవర్గ అభివృద్ధితో పాటు అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం నుంచి అవసరమైన నిధులను తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. సోమవారం మెదక్ పట్టణంలోని మంజీరా గార్డెన్లో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణి కార్యక్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద కుటుంబాలకు రేషన్ కార్డు ఎంతో కీలకమని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేందుకు అర్హత కల్పించే ముఖ్యమైన పత్రాల్లో ఇది ఒకటని అన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో నిర్లక్ష్యం జరిగిందని ఎమ్మెల్యే ఆరోపించారు. దీంతో అనేక మంది అర్హులైన పేద కుటుంబాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరంగా ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అర్హత కలిగిన కుటుంబాలను గుర్తించి స్మార్ట్ రేషన్ కార్డులు అందించే ప్రక్రియను చేపట్టిందన్నారు.

సంక్షేమ పథకాల అమలులో అర్హత, పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. పేద ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి అవసరమైన నిధులు తీసుకురావడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్య, వైద్యం తదితర రంగాల్లో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజల అవసరాలను గుర్తించి దశలవారీగా అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు.

అభివృద్ధి.. సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యత
ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమంతో పాటు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి నంబర్ వన్‌గా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే మరోసారి స్పష్టం చేశారు. ప్రజల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కానుగు రాధిక భూపతిరాజు, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు,మున్సిపల్ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్మార్ట్ రేషన్ కార్డు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.





