🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

నిజాయితీని చాటుకున్న పంచాయతీ కార్యదర్శి: మహిళ పోగొట్టుకున్న పర్సు, నగదు, ఉంగరం అందజేత

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 ఆందోల్ | 🗓 07 Oct 2026 | ⏰ 06:06 PM

ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే కాకుండా, విధి నిర్వహణలో నిజాయితీ, మానవత్వాన్ని చాటుకుంటూ ఓ మహిళ పోగొట్టుకున్న విలువైన వస్తువులను తిరిగి అందజేసి అల్మాయిపేట్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎం.డి. నిసార్ హుస్సేన్ ఆదర్శంగా నిలిచారు. పరుల సొమ్ముపై ఆశపడకుండా విలువైన పర్సును బాధితురాలికి అప్పగించి ప్రజల మన్ననలు పొందారు.

పర్సు పోగొట్టుకున్న మహిళ.. గ్రామ గ్రూప్‌లో సమాచారం

చిలిపిచేడ్ మండలం ఫైజాబాద్ గ్రామానికి చెందిన దాండింగే కీర్తన అనే మహిళ ఇటీవల ప్రయాణంలో తన పర్సును పోగొట్టుకున్నారు. ఆ పర్సులో నగదు, బంగారు ఉంగరం మరియు విలువైన గుర్తింపు కార్డులు (ఐడీ కార్డులు) ఉన్నాయి. కాగా, ఈ పర్సు అల్మాయిపేట్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎం.డి. నిసార్ హుస్సేన్‌కు దొరికింది. దానిని స్వార్థంతో తన వద్ద ఉంచుకోకుండా, బాధితులకు చేర్చాలనే సదుద్దేశంతో పర్సు వివరాలను గ్రామ పంచాయతీ అధికారిక వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశారు.

కార్యాలయంలో బాధితురాలికి అప్పగింత

వాట్సాప్ గ్రూపులో వచ్చిన సమాచారం తెలుసుకున్న బాధితురాలు కీర్తన వెంటనే పంచాయతీ కార్యదర్శి నిసార్ హుస్సేన్‌ను సంప్రదించారు. పర్సు భద్రంగా అల్మాయిపేట్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉందని, సరైన ఆధారాలు చూపించి తీసుకెళ్లవచ్చని కార్యదర్శి తెలిపారు. మరుసటి రోజు కీర్తన పంచాయతీ కార్యాలయానికి చేరుకోగా, స్థానిక గ్రామ పెద్దలు, ప్రజల సమక్షంలో పర్సులో ఉన్న నగదు, ఉంగరం, గుర్తింపు కార్డులను నిసార్ హుస్సేన్ చేతుల మీదుగా ఆమెకు అందజేశారు.

విలువైన వస్తువులు దొరికినప్పటికీ నిస్వార్థంగా తిరిగి అప్పగించి నిజాయితీని చాటుకున్న కార్యదర్శి నిసార్ హుస్సేన్‌ను గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు శాలువాతో సత్కరించి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో బి. బాలు, మహబూబ్, డి. బాలయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్