🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

డ్రగ్స్ వద్దు.. జీవితమే ముద్దు: జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 28 Sep 2026 | ⏰ 08:08 PM

డ్రగ్స్ వద్దు.. జీవితమే ముద్దు” అనే నినాదంతో యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (DMHO) డా. గణేశ్వర్ పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలను ఆయన సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్’ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాలను విద్యార్థులకు వివరించారు.

ఈ సందర్భంగా డా. గణేశ్వర్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ జాతీయ ఉద్యమం ద్వారా వికసిత్ భారత్ సాధనలో యువతను వ్యసనాలకు దూరంగా ఉంచడమే ప్రధాన లక్ష్యమన్నారు. తల్లిదండ్రులు ఎన్నో కష్టనష్టాలకోర్చి, పస్తులుండి పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారని, వారి ఆశలను వమ్ము చేయకుండా విద్యార్థులు క్రమశిక్షణతో చదువుపైనే దృష్టి సారించాలని సూచించారు. ఒక్కసారి మత్తు పదార్థాలు, చెడు సావాసాలకు అలవాటు పడితే శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా జీవితాలు నాశనమవుతాయని హెచ్చరించారు. క్రీడలు, సృజనాత్మకత, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం కళాశాల విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ (Pledge) చేయించారు.

డ్రగ్స్ వద్దు.. జీవితమే ముద్దు

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్