🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

మెదక్ ప్రజల ఆరు దశాబ్దాల ఆకాంక్షను సాకారం చేసింది కేసీఆరే: కాగడాల ర్యాలీలో పద్మాదేవేందర్‌రెడ్డి

జనార్ధన్
జనార్ధన్ 📍 మెదక్ | 🗓 10 Oct 2026 | ⏰ 10:16 PM

మెదక్‌, అక్టోబర్‌ 10: మెదక్‌ ప్రజల ఆరు దశాబ్దాల ప్రత్యేక జిల్లా ఆకాంక్షను మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సాకారం చేశారని మాజీ డిప్యూటీ స్పీకర్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మెదక్‌ జిల్లా ఏర్పాటై పదేళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో పట్టణంలో కాగడాల ర్యాలీ నిర్వహించారు. క్రిస్టల్‌ గార్డెన్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆర్టీసీ డిపో వరకు కొనసాగింది.

ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. గతంలో జిల్లా అధికారులను కలవాలన్నా ప్రజలు సంగారెడ్డికి వెళ్లాల్సి వచ్చేదని గుర్తుచేశారు. ప్రత్యేక జిల్లా ఏర్పాటుతో పరిపాలన ప్రజలకు చేరువైందని, కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, మెడికల్‌ కళాశాల వంటి సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఘనపూర్‌ ప్రాజెక్టు మరమ్మతులతో సాగునీటి సదుపాయాల మెరుగుదలకు కృషి చేశారని పేర్కొన్నారు. జిల్లా ఏర్పాటు మెదక్‌ అభివృద్ధికి కొత్త దిశ చూపిందన్నారు.

నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌ హయాంలో తెలంగాణలో 33 జిల్లాల ఏర్పాటు ద్వారా పరిపాలన ప్రజలకు చేరువైందన్నారు. మెదక్‌లో మెడికల్‌, నర్సింగ్‌ కళాశాలలు, రైలు సదుపాయం అందుబాటులోకి రావడం ప్రాంత అభివృద్ధిలో కీలక పరిణామాలని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక జిల్లా అభివృద్ధి వెనుకబడిందని, రైతులకు సాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని విమర్శించారు.

కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ హేమలత శేఖర్‌గౌడ్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ ఆరేళ్ల మల్లికార్జున్‌గౌడ్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్లు బట్టి జగపతి, ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, గంగా నరేందర్‌, పట్టణ పార్టీ కన్వీనర్‌ మామిళ్ల ఆంజనేయులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మెదక్ ప్రజల ఆరు దశాబ్దాల ఆకాంక్షను సాకారం చేసింది కేసీఆరే: కాగడాల ర్యాలీలో పద్మాదేవేందర్‌రెడ్డి

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
జనార్ధన్
రచయిత గురించి (Author Bio)

జనార్ధన్

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్