🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

హవేలీ ఘనపూర్ పీఆర్టీయూ మండల అధ్యక్షుడిగా రఘుబాబు

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 హవేలీఘనపూర్ | 🗓 01 Oct 2026 | ⏰ 04:06 PM

మెదక్ అక్టోబర్ 1: పీఆర్టీయూ హవేలీ ఘనపూర్ మండల నూతన కమిటీని గురువారం రాజ్‌పేట ప్రాథమిక పాఠశాలలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా నందారం రఘుబాబు, ప్రధాన కార్యదర్శిగా నరేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులు అమీర్‌ఉద్దీన్, హరిబాబులు నూతన కమిటీని ప్రకటించారు. సమావేశంలో పీఆర్టీయూ మెదక్ జిల్లా అధ్యక్షుడు తాళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంఘం రాజీలేని పోరాటం చేస్తుందని తెలిపారు. పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ఎల్.మల్లారెడ్డి, మహేష్, టి.శ్రీనివాస్, సుభాష్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, లక్ష్మీకాంతం తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్