ఆందోల్ సెప్టెంబర్ 24 (ప్రజా నేస్తం) : అందోల్ మండలం జోగిపేట పట్టణంలో గల ఎక్సైజ్ అధికారులు సీఐ ఎస్ఐలు బదిలీపై వెళ్లినప్పటికీ నూతనంగా వచ్చిన అధికారులు గత 20 రోజులు గడుస్తున్న ఆఫీస్ సూచిక బోర్డులో పాత పేర్లే దర్శనమిస్తున్నాయి స్థానికంగా గ్రామాల్లో మద్యం ఏరులై పారుతున్న ఎలాంటి అధికారుల అనుమతులు లేకుండా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుపుతున్న ప్రదేశాలలో ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ స్పందన లేకుండా పోయింది అని స్థానిక ప్రజలు అంటున్నారు అధికార ఆఫీస్ బోర్డు సూచికలో అసలు అధికారి ఎవరు విధుల్లో ఉన్నవాళ్లు ఎవరు అని సూచిక బోర్డులో చూసేసరికి పాత పేర్లు దర్శనం ఇవ్వడంతో 20 రోజుల నుంచి బోర్డులో పేర్లు మార్చడానికి అధికారులకు టైం సరిపోవడం లేదని స్థానిక ప్రజలు ఆశ్చర్య పడుతున్నారు.
జోగిపేట ఎక్సైజ్ స్టేషన్లో అధికారులు మారినా.. మారని బోర్డుపై పేర్లు

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:



