🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

దసరా వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన జగ్గారెడ్డి

Buchaiah
Buchaiah 📍 సంగారెడ్డి | 🗓 15 Oct 2026 | ⏰ 08:05 PM
  • అంబేడ్కర్ స్టేడియంలో 55 అడుగుల రావణాసురుడి బొమ్మ ఏర్పాటు
  • ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచన

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి : సంగారెడ్డి పట్టణంలోని అంబేడ్కర్ స్టేడియంలో దసరా ఉత్సవాల నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం పరిశీలించారు. రావణ దహనం కోసం ఏర్పాటు చేస్తున్న 55 అడుగుల రావణాసురుడి బొమ్మతో పాటు బాణసంచా కాల్చేందుకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించి, ఉత్సవ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.

గత 30 ఏళ్లుగా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో అంబేడ్కర్ స్టేడియంలో ఏటా దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. భారీ రావణాసురుడి బొమ్మ దహనం, బాణసంచా ప్రదర్శనతో పాటు ప్రముఖ కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ ఏడాది కూడా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సందర్భంగా స్టేడియం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని జగ్గారెడ్డి సూచించారు.

మైదానంలోని ముళ్లకంపలను తొలగించి, చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేయాలని మున్సిపల్ సిబ్బందికి, ఉత్సవ నిర్వాహకులకు తెలిపారు. దసరా వేడుకలకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, భవాని యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు బెస్త నగేష్, కౌన్సిలర్ శ్రీకాంత్, మహేష్ ముదిరాజ్, నాయకులు బొంగుల రవి, కూన సంతోష్, కిరణ్ గౌడ్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
Buchaiah
రచయిత గురించి (Author Bio)

Buchaiah

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్