ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వెంటనే అమలు చేయాలని మండల మహిళా కూలీలు అన్నారు. సోమవారం తుర్కపల్లి మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఇచ్చిన ప్రజావాణిలో మండల నోడల్ అధికారి, ఎంపీడీవో లింకల గీతారెడ్డికి దరఖాస్తు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024 -25 సంవత్సర మధ్యకాలంలో కనీసం 20 రోజులు ఉపాధి పనిచేసి గుంట భూమిలేని కూలీలకు సంవత్సరానికి 12,000 రెండు దఫాలుగా కూలీల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం గుర్తించింది కానీ, ఈ పథకం ఇప్పటివరకు పేద కూలీలకు అమలు చేయడం లేదన్నారు. రైతు భరోసా రైతు బీమా క్రాఫ్ట్ లోన్ వంటి సహాయం కూడా భూమి ఉన్న వారికే అన్ని అవకాశాలు అందుతున్నాయని, ప్రభుత్వం వెంటనే ఈ పథకాన్ని భూమిలేని కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా కూలీలు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వెంటనే అమలు చేయాలి

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:






