రైతులకు నాణ్యమైన 24 గంటల కరెంటు ఇవ్వాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం తుర్కపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో రైతులకు నాణ్యమైన 24 గంటల కరెంటు ఇవ్వాలని విద్యుత్ సబ్స్టేషన్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు అందజేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో 8 గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదని, రైతుల పంటలు ఎండిపోయి ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే 18 గంటల విద్యుత్తును అందజేయాలని డిమాండ్ చేశారు. ఎల్నినో ప్రభావంతో విద్యుత్ సరిగ్గా లేక పంటలు ఎండిపోయి రైతులు ఆందోళనకు గురి అవుతున్నారని, ప్రభుత్వం రైతులకు 24 గంటల కరెంటును అందజేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో పూర్తిగా విఫలమైందని అన్నారు. రైతే రాజు అని నమ్మే ప్రభుత్వాలు రైతులకు కరెంటు ఇవ్వక హరిగోశలు పెడుతున్నారని అన్నారు. రాబోవు కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులే గట్టిగా బుద్ధి చెప్తారని అన్నారు .ఇప్పటికైనా రైతులకు నాణ్యమైన కరెంటును ఇచ్చి వారి పంట పొలాలను కాపాడి రైతులను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్ రెడ్డి ,సెక్రటరీ జనరల్ సాగర్ల పరమేష్ యాదవ్ ,మాజీ ఎంపీపీ బబ్బురి రవీంద్రనాథ్ గౌడ్, సర్పంచులు శీతరాజు, బద్దు నాయక్ ,పుట్ట సాయిలు, మాజీ ఎంపీటీసీలు పలుగుల నవీన్ కుమార్, గిద్దె కరుణాకర్, రాజేష్ నాయక్, మాజీ సర్పంచులు పోగుల ఆంజనేయులు, సురేష్, మహేందర్, మాజీ కోఆప్షన్ సభ్యుడు రహమత్, గ్రామ శాఖ అధ్యక్షుడు బోయిని సత్తయ్య, ఉప సర్పంచ్ గోనె జహంగీర్, నాయకులు భూక్య రవీందర్ నాయక్ ,నల్ల శ్రీకాంత్, బాల్ లింగం, కల్లూరి శ్రీనాథ్, కోండ్ర ముత్యాలు, ఓర్సు బిక్షపతి, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
రైతులకు 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇవ్వాలి కల్లూరి రామచంద్రారెడ్డి

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:






