సంగారెడ్డి జిల్లా ‘మన సమగ్ర ప్రజావాణి’ దినపత్రిక స్టాఫ్ రిపోర్టర్ జోగ్యల్ల రాజు సోమవారం (అక్టోబర్ 5న) తన పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఆందోల్ మండలం జోగిపేట పట్టణానికి చెందిన జోగ్యల్ల రాజు జన్మదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, సీనియర్ జర్నలిస్టులు, తోటి పాత్రికేయ మిత్రులు, శ్రేయోభిలాషులు ఆయనకు ముందుగానే హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో, ప్రజావాణిని అధికారుల దృష్టికి చేరవేయడంలో ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమని సహచర రిపోర్టర్లు కొనియాడారు. నిరంతరం ప్రజాపక్షాన నిలుస్తూ, నిష్పాక్షిక వార్తా సేకరణతో సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు.
ఆ భగవంతుని ఆశీస్సులతో జోగ్యల్ల రాజు కుటుంబ సమేతంగా సుఖసంతోషాలతో, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, జర్నలిజం రంగంలో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తోటి విలేకరులు, ఆప్తమిత్రులు మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.




