మెదక్ సెప్టెంబర్ 23 : పాల ఉత్పత్తిదారుల సహకార సమైక్య విజయ డెయిరీ ఎంసీసీ మెదక్‌లో నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యుల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను పాల ఉత్పత్తిదారులు, విజయ డెయిరీ ప్రతినిధులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. విజయ డెయిరీ నూతన అధ్యక్షుడిగా బాన్సువాడ గోపాల్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా మైలారం రవి, కోశాధికారిగా శేఖర్‌రెడ్డి, కార్యదర్శిగా సాయిరెడ్డి, సలహాదారులుగా గోపాల్, వెంకట్‌గౌడ్ బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా వారిని శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. నూతన కార్యవర్గం పాల ఉత్పత్తిదారుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని పలువురు ఆకాంక్షించారు. పాల ఉత్పత్తిదారులకు విజయ డెయిరీ ద్వారా మరింత మెరుగైన సేవలు అందించడంతో పాటు, వారి ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నూతన కార్యవర్గం సమష్టిగా పనిచేసి విజయ డెయిరీ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విజయ డెయిరీ ప్రతినిధులు, పాల ఉత్పత్తిదారులు, సహకార సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






