సిర్గాపూర్ : సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన నూతన వస్త్రధారణ మహోత్సవానికి కల్హేర్ మండలం మాజీ జెడ్పీటీసీ నరసింహారెడ్డి హాజరయ్యారు. సిర్గాపూర్ మండలం కడుపల్ గ్రామానికి చెందిన ప్రముఖ నాయకులు ఓటర్ రవీందర్ రెడ్డి కుమారుని కుమార్తె నూతన వస్త్రధారణ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హాజరైన మాజీ జెడ్పీటీసీ నరసింహారెడ్డి పాపను ఆశీర్వదించి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సాయిరెడ్డి, పోతనపల్లి సర్పంచ్ శ్రీధర్ రెడ్డి, నాయకులు గోపాల్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, బాల్ రెడ్డి, రవీందర్ రెడ్డి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నూతన వస్త్రధారణలో పాల్గొన్న మాజీ జెడ్పీటీసీ నరసింహారెడ్డి

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:



