నారాయణఖేడ్ : కల్హేర్ మండలంలోని మిర్కన్పేట్ గ్రామానికి చెందిన బొక్క పెద్ద కిష్టయ్య, ముప్పిడి సాయిలు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ఇంటికి వచ్చిన విషయం తెలుసుకున్న నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ నరసింహారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ రాజు, నాందేవ్, వార్డు సభ్యులు ప్రవీణ్, భీమయ్య, అంజయ్య, నాయకులు అన్నారావు, మాల్గొండ, బలరాం, బీరుగొండ తదితరులు పాల్గొన్నారు.
అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:




