🗓 శుక్రవారం 23 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

పబోజు మురళి కార్తీక్ మృతికి సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి నివాళి

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 కొమురవెల్లి | 🗓 08 Oct 2026 | ⏰ 02:22 PM

కొమురవెల్లి: ఐనాపూర్ మాజీ సర్పంచ్ పబోజు విజేందర్ కుమారుడు పబోజు మురళి కార్తీక్ ప్రమాదవశాత్తు మృతి చెందడం పట్ల సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

కుషాయిగూడ, బండ్లగూడలోని వారి నివాసానికి చేరుకున్న నాయకులు మురళి కార్తీక్ భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ తీరని శోకంలో ఆ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.

నివాళులర్పించిన వారిలో సీపీఎం మండల కార్యదర్శి తాడూరి రవీందర్, నాయకులు తేలు ఇస్తారి, కానుగుల రాజు, ఏనుగుల శీను, నవీన్, ఎల్లయ్య, రవీందర్ తదితరులు ఉన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్