🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

వాహనదారుల సమస్యకు కౌన్సిలర్ చొరవతో పరిష్కారం

NARESH SAMARLA
NARESH SAMARLA 📍 బెల్లంపల్లి | 🗓 08 Oct 2026 | ⏰ 02:54 PM

బెల్లంపల్లి, అక్టోబర్ 8: బెల్లంపల్లి మున్సిపాలిటీ 13వ వార్డు పరిధిలోని కాల్‌టెక్స్‌ నుంచి అశోక్‌నగర్‌ వెళ్లే మార్గంలోని అండర్‌ బ్రిడ్జి వద్ద రహదారి అధ్వానంగా మారడంతో గత కొన్నిరోజులుగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పలువురు స్థానికులు వార్డు కౌన్సిలర్‌ దొంగల రాజ్‌కుమార్‌ యాదవ్‌ (చింటు) దృష్టికి తీసుకెళ్లారు.
స్థానికుల సమస్యపై వెంటనే స్పందించిన కౌన్సిలర్‌ దొంగల రాజ్‌కుమార్‌ యాదవ్‌ మున్సిపల్‌ జేసీబీ సహాయంతో రహదారిని చదును చేయించారు.

అంతేకాకుండా వర్షపు నీరు రహదారిపై నిల్వ ఉండకుండా సులభంగా వెళ్లిపోయేలా పైపును ఏర్పాటు చేయించారు. దీంతో వాహనదారులకు, స్థానికులకు ఇబ్బందులు తొలగడంతో వారు కౌన్సిలర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్‌ పార్టీ నాయకులు హనీఫ్‌, మురుకూరి శ్రావణ్‌, చింతల శ్రీనివాస్‌, ఉమామహేశ్వర్‌, పాషా, బంక కుమార్‌, ఈగ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
NARESH SAMARLA
రచయిత గురించి (Author Bio)

NARESH SAMARLA

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్