బెల్లంపల్లి, అక్టోబర్ 9:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ 13వ వార్డు పరిధిలోని గాంధీనగర్, గంగారాంనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన విద్యార్థులకు అల్పాహారం పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ దొంగల రాజ్ కుమార్ యాదవ్ (చింటు) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా విద్యార్థులకు అల్పాహారం వడ్డించారు.
విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు, వారు ఉత్సాహంగా చదువుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించడం, వారి విద్యాభివృద్ధికి తోడ్పడటం ముఖ్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అసం అఖిల్, గజాణవేణి గజేందర్, బండి శంకర్, సింగరావ్ సురేష్, కొమ్ము శ్రావణ్‌తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులకు అల్పాహారం పంపిణీ ప్రారంభించిన కౌన్సిలర్ దొంగల రాజ్ కుమార్ యాదవ్

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:






