🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

Food Safety Inspections : ఆహార పదార్థాల్లో కల్తీని ఉపేక్షించేది లేదు: కలెక్టర్‌ హరిత

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 కొమరం భీం ఆసిఫాబాద్ | 🗓 30 Sep 2026 | ⏰ 11:12 PM

ప్రజానేస్తం ప్రతినిధి: ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడేలా (Food Safety Inspections) ఆహార పదార్థాల్లో కల్తీకి పాల్పడే వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని కొమరం భీం ఆసిఫాబాద్ (kumaram bheem asifabad) జిల్లా కలెక్టర్‌ హరిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఆహార భద్రత సలహా కమిటీ సమావేశానికి అదనపు కలెక్టర్‌ డేవిడ్‌తో కలిసి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు స్వచ్ఛమైన, నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేయాలన్నారు. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్ షాపులు, వీధి వ్యాపారుల వద్ద ఆహార నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఆహార పదార్థాల తయారీలో నిషేధిత రసాయనాలు, నాసిరకం నూనెలు, సింథటిక్ రంగులు, గడువు ముగిసిన ముడిసరుకులు వినియోగిస్తే సంబంధిత వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

అన్ని వ్యాపార సంస్థలు తప్పనిసరిగా ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) లైసెన్సులు, సరైన రిజిస్ట్రేషన్లు కలిగి ఉండాలని స్పష్టం చేశారు. అనుమతులు లేని దుకాణాలను సీజ్ చేయాలని, క్రమం తప్పకుండా శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌లకు పంపించాలని ఫుడ్ సేఫ్టీ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు వండి వార్చే భోజనం నాణ్యతపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వంట కోసం ఉపయోగించే బియ్యం, పప్పులు, కూరగాయలు, నూనెలు అత్యుత్తమ నాణ్యతతో ఉండాలని, తాగునీరు పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని హెచ్చరించారు.

కల్తీని నియంత్రించడంలో ప్రజలను కూడా భాగస్వాములను చేయాలని, ఫిర్యాదుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) సచ్చిదానందచారి, జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) భిక్షపతి, ఆహార భద్రత అధికారి వాసురావు, ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్‌ మహేందర్‌, వివిధ శాఖల వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్