🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఆందోళన

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 30 Sep 2026 | ⏰ 08:25 PM

మెదక్ సెప్టెంబర్ 30: సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్ ఆధ్వర్యంలో బుధవారం మెదక్ రాందాస్ చౌరస్తాలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ ను దహనం చేశారు. హిందూ దేవుళ్ల పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ తెలిపారు. ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన దేవుడిని ఆరాధించుకునే హక్కు ఉందని, ఇతరుల మత విశ్వాసాలను గౌరవించాలని అన్నారు. దేశాన్ని ప్రాంతాల వారీగా విభజించే వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రజల మనోభావాలను దెబ్బతీయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పబ్బ రాజమణి లక్ష్మణ్, మెదక్ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు బజ్జూరి భిక్షపతి, జనరల్ సెక్రటరీ రంజిత్ రెడ్డి, సాయి గౌడ్, సాయి దీపు, జిల్లా నాయకులు లోకేష్, అల్లం మధు, రాహుల్, ఆమ్దం సాయి, సన్నీ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్