రంగారెడ్డి జిల్లా : వేద పాఠశాలలో అన్న దానం చేయడం చాలా విశేషం అని, ఇలాంటి అరుదైన అవకాశం కొందరికి మాత్రమే వస్తుందని వేద పండితులు కొనియాడారు. పట్టణానికి చెందిన బోగ నవ్య కిషోర్ దంపతుల గారాల ముద్దు బిడ్డ భోగ ఆర్యన్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం వేద పాఠశాల లో అన్న దానం ఏర్పాటు చేశారు.
ఈ సందర్బంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ… వేదాలను అభ్యసించే విద్యార్థులకు (వైదిక వటువులకు) అన్నదానం చేయడం వల్ల విశేషమైన పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారన్నారు. ఈ పవిత్ర కార్యాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు. ఈ అన్నదాన కార్యక్రమంలో నితీష్, వెంకటేష్, ప్రకాష్ చారి ఉన్నారు.






