🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

భవాని మాత, సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపనలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

చీటీ సాయితేజ
చీటీ సాయితేజ 📍 అబ్బెంద | 🗓 16 Oct 2026 | ⏰ 04:10 PM

నారాయణఖేడ్ ప్రతినిధి : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పరిధిలోని అబ్బెంద పీర్ల తండాలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తండాలో నూతనంగా నిర్మించిన ఆలయంలో జగన్మాత భవానీ దేవి, బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని గ్రామస్థులు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ మహోత్సవానికి తండా ప్రజల ఆహ్వానం మేరకు నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భూపాల్ రెడ్డి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భవానీ మాత, సేవాలాల్ మహరాజ్ ఆశీస్సులతో తండా ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.

కార్యక్రమం అనంతరం ఆలయ కమిటీ ప్రతినిధులు, తండా పెద్దలు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

ఈ పూజా కార్యక్రమంలో సర్పంచ్ కిరణ్, మాజీ సర్పంచులు సంగప్ప, సుదర్శన్, రాజు నాయక్, ఉపసర్పంచ్ పుడ్లిక్, నాయకులు నవీన్, రవీందర్, దేవి సింగ్‌లతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
చీటీ సాయితేజ
రచయిత గురించి (Author Bio)

చీటీ సాయితేజ

"గత కొన్నేళ్లుగా ప్రజానేస్తం తెలుగు డిజిటల్ న్యూస్ విభాగంలో సీనియర్ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. రాజకీయ, సామాజిక అంశాలపై ప్రామాణిక కథనాలు అందిస్తారు."

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్