మెదక్, సెప్టెంబర్ 29: మెదక్ పట్టణంలోని కోలిగడ్డ 28వ వార్డులో బీజేపీ కౌన్సిలర్ ఇప్ప అఖిల భారత్ ఆధ్వర్యంలో అంగన్ మిలన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలు, బాలింతలకు పౌష్టికాహారం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ద్వారా పిల్లలు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నామని, శిశువు నుంచి చిన్నారుల వరకు వ్యాక్సినేషన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో సేవలందిస్తున్న టీచర్లు, హెల్పర్లను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పట్లోళ్ల మల్లిక, మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, మెదక్ రూరల్ మండలాధ్యక్షురాలు బెండ వీణ, ఎన్‌ఆర్‌ఐ సెల్ జిల్లా కన్వీనర్ సౌజన్య, సన్నీ, తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ ఆధ్వర్యంలో కోలిగడ్డ లో అంగన్ మిలన్

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:





