🗓 శుక్రవారం 23 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు ప్రతీక బతుకమ్మ.. కలెక్టరేట్, సదాశివపేట వేడుకల్లో పాల్గొన్న నిర్మలా జగ్గారెడ్డి

చీటీ సాయితేజ
చీటీ సాయితేజ 📍 సంగారెడ్డి | 🗓 17 Oct 2026 | ⏰ 06:20 PM

సంగారెడ్డి : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో వివిధ శాఖల ఉద్యోగులు, తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు.

రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు, సంప్రదాయ ఆటపాటలతో కలెక్టరేట్‌ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. వివిధ శాఖలకు చెందిన మహిళా ఉద్యోగులు బతుకమ్మల చుట్టూ వలయంగా ఏర్పడి ఉత్సాహంగా ఆడిపాడారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఆలపించిన బతుకమ్మ పాటలు వేడుకలకు మరింత ఉత్సాహాన్ని చేకూర్చాయి.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంగీత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DMHO) లలితా దేవి, కలెక్టరేట్‌లోని వివిధ శాఖలకు చెందిన మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

అనంతరం సదాశివపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లోనూ నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ వేడుకల్లో సందడి చేశారు.

ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ప్రకృతిని పూజిస్తూ, పూలను ఆరాధించే అరుదైన పండుగ బతుకమ్మ తెలంగాణకు ప్రత్యేకమని పేర్కొన్నారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు, సంస్కృతి సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ పండుగ తెలంగాణ ప్రజల సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ, భావితరాలకు వాటి గొప్పతనాన్ని తెలియజేయడంలో బతుకమ్మ పండుగ కీలక పాత్ర పోషిస్తుందని ఆమె తెలిపారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
చీటీ సాయితేజ
రచయిత గురించి (Author Bio)

చీటీ సాయితేజ

"గత కొన్నేళ్లుగా ప్రజానేస్తం తెలుగు డిజిటల్ న్యూస్ విభాగంలో సీనియర్ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. రాజకీయ, సామాజిక అంశాలపై ప్రామాణిక కథనాలు అందిస్తారు."

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్