మెదక్, అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్–మెదక్ జిల్లా ఆధ్వర్యంలో శుక్రవారం మెదక్ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఎస్జీ మెదక్ జిల్లా జనరల్ సెక్రటరీ ఇప్ప రాజేందర్, జిల్లా ఆర్గనైజింగ్ కమిషనర్ తలారి నాగరాజుతో పాటు జిల్లా స్కౌట్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యం, అహింస, శాంతి మార్గాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు. గాంధీజీ కలలుగన్న పరిశుభ్రమైన భారతదేశం కోసం ‘స్వచ్ఛతా హి సేవ’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మాణం, పరిసరాల పరిశుభ్రత, శ్రమదానంపై అవగాహన కల్పించారు. ర్యాలీ ద్వారా సమాజంలో స్వచ్ఛత, శాంతి, అహింస భావాలను పెంపొందించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
గాంధీ జయంతి సందర్భంగా స్కౌట్స్ ఆధ్వర్యంలో ర్యాలీ

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:






