🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

కస్తూర్బా పాఠశాలలో స్వచ్ఛభారత్ కార్యక్రమం

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 28 Sep 2026 | ⏰ 07:42 PM

మెదక్, సెప్టెంబర్ 28: . భారతీయ జనతా పార్టీ చేపట్టిన సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా మెదక్ పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సోమవారం స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల ఆవరణలోని చెత్తాచెదారం తొలగించి, కలుపు మొక్కలు, ఇబ్బందికరమైన మొక్కలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా మార్చారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, జిల్లా కార్యదర్శి కల్కి నాగరాజు, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శులు సాయిబాబా, నర్సింగరావు, ఉపాధ్యక్షులు శశికాంత్, సన్నీ, కార్యదర్శి హర్షవర్ధన్, నవీన్ గౌడ్, పవన్, మాజీ ప్రధాన కార్యదర్శులు నల్లల విజయ్, ఎంఎల్‌ఎన్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు లోకబోయిన లోకేష్, అల్లం మధు, 21వ వార్డు కౌన్సిలర్ పబ్బ రాజమణి లక్ష్మణ్, బీజేవైఎం మాజీ జిల్లా అధ్యక్షుడు సతీష్, కార్మిక శాఖ సెల్ కన్వీనర్ శ్యామయ్య, వాణిజ్య విభాగం జిల్లా కన్వీనర్ బిక్షపతి, అంకం శ్రీనివాస్, వేణు తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్