🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

ఆధునిక మౌలిక వసతులతో మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం: డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు

జనార్ధన్
జనార్ధన్ 📍 మెదక్ | 🗓 01 Oct 2026 | ⏰ 08:41 PM


మెదక్, సెప్టెంబర్ 01 : మెదక్ నియోజవర్గం ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. మెదక్ పట్టణంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఏళ్లుగా ప్రజలు కోరుకుంటున్న మౌలిక వసతులు, రహదారులు, డ్రైనేజీ, ప్రధాన కూడళ్ల అభివృద్ధి, సుందరీకరణ పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. మెదక్ ప్రజలు అభివృద్ధి అంటే ఏమిటో కళ్లారా చూడాలి. అభివృద్ధి కాగితాలపై ఉండకూడదు.. అది రోడ్లపై కనిపించాలి, డ్రైనేజీ వ్యవస్థలో కనిపించాలి, ప్రధాన కూడళ్ల రూపంలో కనిపించాలి, ప్రజలకు అందుతున్న మౌలిక వసతుల్లో కనిపించాలి. అదే మా లక్ష్యం” అని రోహిత్ రావు అన్నారు.

మేదక్ పట్టణానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి ప్రధాన కూడళ్ల అభివృద్ధి, సుందరీకరణతో పాటు ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, మేజర్ ధ్యాన్‌చంద్ వంటి మహనీయుల స్ఫూర్తిని భావితరాలకు అందించేలా ఈ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని పేర్కొన్నారు. “విగ్రహాలు ఏర్పాటు చేయడం మాత్రమే మా ఉద్దేశం కాదు. ఆయా మహనీయుల ఆలోచనలు, సేవలు, త్యాగాలు, స్ఫూర్తి ప్రజలకు మరియు భావితరాలకు గుర్తుండేలా ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే మా ఆలోచన” అని ఎమ్మెల్యే తెలిపారు.

మెదక్ పట్టణంతో పాటు రామాయంపేట ప్రాంత అభివృద్ధికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, పట్టణాల్లో రహదారులు, డ్రైనేజీ, జంక్షన్లు, సుందరీకరణ, ఇతర మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. “ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడం మా బాధ్యత. ప్రతి వార్డులో ప్రజలకు అవసరమైన పనులను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తాం. ఒక్కో సమస్యకు పరిష్కారం చూపుతూ, ఒక్కో ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతాం” అని రోహిత్ రావు స్పష్టం చేశారు.

మెదక్ కేవలం ఒక సాధారణ పట్టణంగా కాకుండా అందమైన, ఆధునిక, సౌకర్యవంతమైన మోడల్ పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ అభివృద్ధి ప్రయాణం ఇక్కడితో ఆగదు. మెదక్ ను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే వరకు కొనసాగుతుంది” అని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్‌పర్సన్ కానుగు రాధిక భూపతి రాజ్, వైస్ చైర్మన్ . నరేష్ గౌడ్, మున్సిపల్ అధికారులు,వార్డు కౌన్సిలర్స్, గంట సంపత్ , స్వరూప, బట్టి ఉదయ్ ,కో ఆప్షన్ సభ్యులు,పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, గంట సంపత్ , స్వరూప, బట్టి ఉదయ్. కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీలు,టౌన్ అధ్యక్షుడు ఎం. గంగాధర్, మైనారిటీ టౌన్ అధ్యక్షుడు మహ్మద్ ఫాజిల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
జనార్ధన్
రచయిత గురించి (Author Bio)

జనార్ధన్

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్