మెదక్ సెప్టెంబర్ 30: యువత ఐక్యతగా ఉంటూ సమాజ సేవలో ముందుండాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామానికి చెందిన హైందవ సేవా సమితి యువకులు సుమారు 50 మంది శంకరంపేట్ మాజీ సర్పంచ్ కుమార్‌గౌడ్, మాజీ వైస్‌ఎంపీపీ సత్యనారాయణగౌడ్, మాజీ ఎంపీటీసీ యాదగిరి, యువ నాయకుడు స్వామి ఆధ్వర్యంలో బుధవారం కంఠారెడ్డి తిరుపతిరెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ..హైందవ సేవా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని అన్నారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో యువత చురుగ్గా పాల్గొనాలని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన సేవా కార్యక్రమాలకు తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో హైందవ సేవా సమితి యువకులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
యువత సమాజ సేవలో ముందుండాలి: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:





