మెదక్, సెప్టెంబర్ 28: . మెదక్ మండలం వెంకటాపూర్ తాండ ప్రాథమిక పాఠశాలలో సోమవారం నుంచి విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించే కార్యక్రమాన్ని సర్పంచ్ యాద గౌడ్ ప్రారంభించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సమక్షంలో విద్యార్థులకు అల్పాహారం అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ యాద గౌడ్ చిన్నారులతో కలిసి అల్పాహారం స్వీకరించారు. విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ఆహారం అందించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. అల్పాహారం వల్ల విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలకు హాజరై చదువుపై మరింత శ్రద్ధ పెట్టేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
వెంకటాపూర్ తాండ పాఠశాలలో అల్పాహారం ప్రారంభం

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:





