మెదక్, సెప్టెంబర్ 28: . మెదక్ మండలం ర్యాలమడుగు గ్రామపంచాయతీకి చెందిన 15వ, 16వ ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగంపై గ్రామ సర్పంచ్‌పై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ గ్రామ నాయకులు జిల్లా పంచాయతీ అధికారికి యాదయ్యకు ఫిర్యాదు చేశారు.
గ్రామపంచాయతీ ఖాతాలో రూ.14.20 లక్షలు జమ కాగా, అందులో రూ.11.89 లక్షలు డ్రా చేసినట్లు తెలిపారు. వివిధ చెల్లింపులు పోను మిగిలిన నిధులను ఎలాంటి తీర్మానాలు, బిల్లులు, అధికారుల అనుమతులు లేకుండా వివిధ పనుల పేరుతో వినియోగించినట్లు సర్పంచ్ పై ఆరోపించారు. నిధుల వినియోగంపై గ్రామసభలో లెక్కలు అడిగినా సరైన సమాధానం ఇవ్వలేదని పేర్కొన్నారు.

నిధుల వినియోగంపై సమగ్ర విచారణ జరిపి, అవకతవకలు జరిగితే సర్పంచ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, గ్రామాభివృద్ధి నిధులను పరిరక్షించాలని వారు అధికారులను కోరారు.






