🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

కంట్రీ మేడ్ పిస్టల్‌తో రౌడీషీటర్ అరెస్ట్

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 14 Sep 2026 | ⏰ 04:41 PM

రూ.45 వేలకు పైగా చెల్లించి పిస్టల్ కొనుగోలు.. ఆరుగురు లైవ్ రౌండ్లు స్వాధీనం

హైదరాబాద్: నగరంలోని గుడిమల్కాపూర్‌లో కంట్రీ మేడ్ పిస్టల్‌తో తిరుగుతున్న రౌడీషీటర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కమిషనర్ టాస్క్‌ఫోర్స్ గోల్కొండ జోన్, గుడిమల్కాపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో సయ్యద్ అబిద్ హుస్సేన్ అలియాస్ అలీ భాయ్ అలియాస్ అలీ డాన్ (55), మహమ్మద్ అంజద్ (31)ను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు సాహిల్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

నిందితుల నుంచి ఒక దేశీయ పిస్టల్, మ్యాగజైన్, 6 లైవ్ రౌండ్లు, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. అబిద్ హుస్సేన్‌పై గతంలో హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, బెదిరింపులు, వసూళ్లు, ఆర్మ్స్ యాక్ట్ తదితర కేసులు నమోదయ్యాయి. దర్యాప్తులో అతడికి జహీరాబాద్‌లో రౌడీషీట్ ఉన్నట్లు గుర్తించారు.

విచారణలో భాగంగా.. పరారీలో ఉన్న సాహిల్ నుంచి రూ.45 వేలకు పైగా చెల్లించి పిస్టల్ కొనుగోలు చేసినట్లు అబిద్ హుస్సేన్ వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆ ఆయుధాన్ని అంజద్ వద్ద భద్రపరిచినట్లు విచారణలో తేలిందన్నారు.

ఈ ఘటనపై గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఆర్మ్స్ యాక్ట్‌లోని సెక్షన్లు 25(1-B)(a), 29 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పరారీలో ఉన్న సాహిల్ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.

పట్టుబడిన నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మొబైల్ ఫోన్లకు సంబంధించిన అంశాలపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్