🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 26 Sep 2026 | ⏰ 04:07 PM
  • మెదక్‌లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
  • విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

మెదక్, సెప్టెంబర్ 26 (ప్రజా నేస్తం): సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కార్మిక, ఉపాధి కల్పన, గనులు మరియు భూగర్భ వనరుల శాఖల మంత్రి, మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు.

వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం మెదక్ పట్టణంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుతో కలిసి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, నాటి సామాజిక అన్యాయాలను ధైర్యంగా ఎదిరించి నిలిచిన ఐలమ్మ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆమె కనబరిచిన ఆత్మవిశ్వాసం, పోరాట పటిమ నేటి తరానికి ఎంతో ఆదర్శమన్నారు. వెనుకబడిన తరగతుల విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.

ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ, ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నిత్యం స్మరించుకోవాలని, ఆ ధైర్యాన్ని ఆదర్శంగా తీసుకుని యువత తమ జీవితాల్లో ఉన్నత లక్ష్యాలను సాధించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఉపేందర్, వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్