🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

జోగిపేట ఎంఈఓ కార్యాలయం ఎదుట మద్యం బాటిల్

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 25 Sep 2026 | ⏰ 07:18 PM

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 25( ప్రజా నేస్తం) : జోగిపేట ఎంఈఓ కార్యాలయం ఎదుట మద్యం బాటిల్ కనిపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. విద్యాశాఖకు సంబంధించిన కార్యాలయం పరిసరాల్లో మద్యం బాటిల్ పడివుండటంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్సెస్ శాఖ నిద్రపోతున్నారా లేక పట్టించుకోవడం లేదా అని పలువురు వ్యక్తం చేస్తున్నారు. విచ్చలవిడిగా బెల్టు షాపులు ఉండటంతో మందుబాబులకు అడ్డు అలుపు లేకుండా పోయింది. దీనిపై వెంటనే చర్య తీసుకోవాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు రాకపోకలు సాగించే ప్రాంతంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంపై అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. కార్యాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, మద్యం బాటిల్ అక్కడికి ఎలా వచ్చిందనే విషయంపై సంబంధిత అధికారులు పరిశీలించాలని వారు కోరుతున్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్