🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

ఫతేనగర్ పాఠశాలలో వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 24 Sep 2026 | ⏰ 06:16 PM

మెదక్, సెప్టెంబర్ 24: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం, ఆయన 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని మెదక్ పట్టణంలోని ఫతేనగర్ ప్రాథమికోన్నత పాఠశాలలో వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. స్థానిక 21వ వార్డు కౌన్సిలర్ పబ్బ రాజమణి లక్ష్మణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేశారు.
ముఖ్య అతిథిగా బీజేపీ మెదక్ జిల్లా మాజీ అధ్యక్షుడు, జగిత్యాల జిల్లా ఇన్‌చార్జి గడ్డం శ్రీనివాస్ పాల్గొన్నారు. దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, వికసిత భారత్ లక్ష్య సాధనకు కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా యువత ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అశోక్, ఉపాధ్యాయ బృందం, 22వ వార్డు కౌన్సిలర్ గౌస్ ఖురేషి, బీజేపీ నాయకులు బెండల స్వామి, నాయిని ప్రసాద్, రంజిత్, ఎం.ఎల్.ఎన్. రెడ్డి, గడ్డం కాశీనాథ్, నల్లాల విజయ్, బజ్జూరి భిక్షపతి, నాగరాజు, మధు, ఆంజనేయులు, అంకం శ్రీనివాస్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్