అందోల్ నియోజకవర్గం ప్రతినిధి సెప్టెంబర్ 23 ( ప్రజా నేస్తం ) : దళిత జర్నలిస్ట్ ఫోరం ( డి జె ఎఫ్ ) ఆధ్వర్యంలో అక్టోబర్ 7న సంగారెడ్డిలో నిర్వహించనున్న 11వ రాష్ట్ర మహాసభలకు ఆల్మాయిపేట గ్రామ సర్పంచ్ దుర్గాప్రసాద్ ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా డి జె ఎఫ్ జిల్లా కార్యదర్శి జోగ్యల్ల రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు మాదిగ బుచ్చయ్య, మ్యాకల అమరేందర్ సర్పంచ్ దుర్గాప్రసాద్‌ను కలిసి మహాసభలకు హాజరుకావాలని ఆహ్వాన పత్రం అందజేశారు. అనంతరం సర్పంచ్ దుర్గాప్రసాద్ చేతుల మీదుగా 11వ రాష్ట్ర మహాసభల గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సభ్యులు బంటు రాజు, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
దళిత జర్నలిస్ట్ రాష్ట్ర మహాసభలకు సర్పంచ్‌కు ఆహ్వానం

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:



