🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

గణేష్ నిమజ్జనం: ఫ్యూచర్ సిటీ పరిధిలో మద్యం దుకాణాలు బంద్.. సీపీ తరుణ్ జోషి ఉత్తర్వులు

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 23 Sep 2026 | ⏰ 06:20 PM

ఫ్యూచర్ సిటీ/రంగారెడ్డి :

గణేష్ నవరాత్రుల ముగింపు సందర్భంగా నిర్వహించే వినాయక విగ్రహాల తుది నిమజ్జనం దృష్ట్యా ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలను తాత్కాలికంగా మూసివేయాలని అధికారులు ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ చట్టం, 1968 లోని సెక్షన్ 20 ప్రకారం తమకు గల అధికారాలను వినియోగిస్తూ ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి, ఐపీఎస్ బుధవారం ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు.

అమలు సమయం & వివరాలు:

  • మూసివేత సమయం: సెప్టెంబర్ 25, 2026 ఉదయం 6:00 గంటల నుండి సెప్టెంబర్ 26, 2026 ఉదయం 6:00 గంటల వరకు (మొత్తం 24 గంటల పాటు).

  • వర్తించేవి: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని వైన్ షాపులు, కల్లు దుకాణాలు మరియు రెస్టారెంట్లకు అనుబంధంగా ఉండే సాధారణ బార్లకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి.

  • మినహాయింపులు: స్టార్ హోటళ్లలోని బార్లు మరియు రిజిస్టర్డ్ క్లబ్బులకు మాత్రమే ఈ మూసివేత ఉత్తర్వుల నుంచి మినహాయింపునిచ్చారు.

నిర్దేశిత సమయంలో నిబంధనలను కచ్చితంగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. నిమజ్జన వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు వ్యాపారులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్