🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

మద్యానికి మంత్రి ఉన్నారు.. విద్యకు ఎందుకు లేరు?: ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి నిలదీత

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 23 Sep 2026 | ⏰ 06:58 PM

మెదక్, ప్రజానేస్తం ప్రతినిధి: రాష్ట్రంలో మద్యానికి ప్రత్యేక మంత్రి ఉన్నప్పుడు, అత్యంత కీలకమైన విద్యా రంగానికి ప్రత్యేక మంత్రి ఎందుకు లేరని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజుల పాలన పూర్తి చేసుకుంటున్నా, విద్యార్థులకు ఇచ్చిన ఏ ఒక్క ఎన్నికల హామీని కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు.

మంగళవారం మెదక్ పట్టణంలోని టీఎన్జీవో భవన్‌లో ఏఐఎస్ఎఫ్ మెదక్ జిల్లా 20వ మహాసభలు ఘనంగా నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆశ రాజు అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలకు మణికంఠరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

హామీలు ఏమయ్యాయి? బకాయిలు విడుదల చేయాలి:

ఈ సందర్భంగా మణికంఠరెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు, బడ్జెట్‌లో విద్యా రంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఇప్పటివరకు ఆ హామీల అమలుపై స్పష్టత లేదని మండిపడ్డారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయకపోవడంతో విద్యార్థులు కళాశాలల నుంచి తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా రూ.2,400 కోట్లతో ముందస్తుగా విద్యార్థుల ఖాతాల్లోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, పాత బకాయిలను పూర్తిస్థాయిలో చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు.

మద్యానికి మంత్రి ఉన్నారు.. విద్యకు ఎందుకు లేరు?: ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి నిలదీత

పాలిటెక్నిక్‌ల విలీనం రద్దు చేయాలి – మెదక్‌కు వర్సిటీ కావాలి:

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడాన్ని ఏఐఎస్ఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. ఈ విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని, సంబంధిత జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సింది పోయి విలీనం పేరిట సాంకేతిక విద్యను నీరుగార్చవద్దని హెచ్చరించారు.

అలాగే ఉమ్మడి మెదక్ జిల్లా విద్యార్థులు ఉన్నత చదువుల కోసం రాజధాని హైదరాబాద్‌కు వెళ్లాల్సి వస్తోందని, స్థానికంగా ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు మెదక్ జిల్లా కేంద్రంగా వెంటనే నూతన ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని (యూనివర్సిటీ) ఏర్పాటు చేయాలని కోరారు.

ఉద్యమం తప్పదు:

1000 రోజుల పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి మెదక్‌లో విద్యా రంగ పరిస్థితులపై కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదని అసహనం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల, పాలిటెక్నిక్ కళాశాలల పరిరక్షణ, మెదక్‌లో యూనివర్సిటీ ఏర్పాటు వంటి ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

ఈ మహాసభల్లో ఏఐఎస్ఎఫ్ జిల్లా నిర్మాణ బాధ్యులు ఖలీక్, జిల్లా కార్యదర్శి దినకర్, రాష్ట్ర గర్ల్స్ వింగ్ కో-కన్వీనర్ కండె విజేత, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మచ్చ రమేష్, జిల్లా ఆఫీస్ బేరర్ పాపయ్యలతో పాటు జిల్లా నాయకులు తేజ, శివ, సంజన, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్